ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు.. వారం మాత్రమే... | ap high court stopped entry tax for week | Sakshi
Sakshi News home page

ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు.. వారం మాత్రమే...

Apr 1 2015 3:37 PM | Updated on Mar 28 2019 5:32 PM

ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు.. వారం మాత్రమే... - Sakshi

ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు.. వారం మాత్రమే...

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ వారం పాటు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ వారం పాటు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని సూచించింది.

ఎంపీ కేశినేని నాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. కోర్టును ఆశ్రయించిన వారు తప్ప మిగతా వారంతా ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement