ఇంగ్లీష్‌ మీడియంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు | AP Government Orders On English Medium | Sakshi
Sakshi News home page

ప్రతి మీడియంలో తెలుగు తప్పని సరి

Mar 23 2020 10:25 AM | Updated on Mar 23 2020 10:38 AM

AP Government Orders On English Medium - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగిస్తూ ప్రతి మీడియం స్కూల్‌లోనూ తెలుగును తప్పనిసరి చేయాలని ఆదేశాలిచ్చింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement