ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విజయ్‌ చందర్‌

AP Government appoints film actor Vijayachander as APFDC Chairman - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ్‌ చందర్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు  ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విజయ్‌ చందర్‌ కరుణామయుడుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే సాయిబాబాగా కూడా ఆయన తన నటనతో మెప్పించారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విజయ్‌ చందర్‌కు తాత అవుతారు. 

అధికార భాషా సంఘం సభ్యుల నియామకం
అధికార భాషా సంఘం సభ్యులుగా నలుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి కె. ప్రవీణ్‌ కుమార్‌ సోమవారం జీవో జారీ చేశారు. అధికార భాషా సంఘం సభ్యులుగా మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్‌ మస్తాన్‌, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్‌ జ్యో‍త్స్నా రాణి నియమితులయ్యారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top