ప్రముఖులకు ఉగాది పురస్కారాలు

ప్రముఖులకు ఉగాది పురస్కారాలు - Sakshi


విజయవాడ కల్చరల్‌ : రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగే ఉగాది వేడుకల్లో ప్రదానం చేయనుంది. అవార్డు గ్రహీతలకు రూ. 10 వేల నగదు బహుమతి అందించి సన్మానించనుంది.



పురస్కార గ్రహీతలు వీరే..

రఘుపతుని శ్రీకాంత్ (నాట్యం), ఎల్‌.నందికేశ్వరరావు (మిమిక్రీ), బోనం గురుస్వామి (థియేటర్‌), చదలవాడ ఆనంద్‌ (కూచిపూడి నృ‍త్యం), మల్లిపురం జగదీశ్‌ (సాహిత్యం), గంటేడ గౌరినాయుడు (సాహిత్యం), ద్వారం లక్షి (సంగీతం), పి.శాంతామూర్తి (గ్రంథాలయం), జాలాది విజయకుమారి, చింతికింది శ్రీనివాసరావు (సాహిత్యం), గోమతి లక్ష్మి, పిల్ల జమున (థిమ్సా నృత్యం), ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి, డాక్టర్‌ వెంకటసూర్యారావు, కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, పైడిపాల (సాహిత్యం), చింతా శ్యామ్‌కుమార్ (మ్యాజిక్‌), బాబూరావు (మిమిక్రీ), చిలుకూరి శ్రీనివాసరావు (మొక్కల పెంపకం), నామడి శ్రీధర్‌ (సాహిత్యం), సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ (జర్నలిజం), ఇందుకూరి విజయలక్ష్మి, ఝుట్టం మాణిక్యాలరావు(సామాజిక సేవ), వేమవరపు నరసింహమూర్తి (రంగ స్థలం), ఎల్‌ఆర్‌ కృష్ణబాబు (జానపదం), పువ్వాడ తిక్కన సోమయాజి(సాహిత్యం), వెన్నా వల్లభరావు (అనువాదం), కుమార సూర్యనారాయణ, మోదుమూడి సుధాకర్ (గాత్రం), చింతా రవి బాలకృష్ణ (నాట్యం), పరుచూరి విజయలక్ష్మి, రాజేశ్వరి (సామాజిక సేవ), దాసరి అల్వార్‌ స్వామి, ఏలూరి రఘుబాబు (జర్నలిజం), దామోదర గణపతిరావు, గంగాధర్ (జానపదం), రెజీనా (సాహిత్యం), వేందాంతం దుర్గాభవాని (కూచిపూడి), గోళ్ల నారాయణరావు (సామాజిక సేవ), అంగటాల వరప్రసాద్, కొట్టి రామారావు (సాహిత్యం), డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ, డాక్టర్‌  సుబ్బారావు, గద్దె రామతులశమ్మ, విజయ్‌కాంత్, కంచర్ల రామయ్య, మునిరత్నం నాయుడు (సామాజిక సేవ),  మంగళగిరి పద్మావతిదేవి, మొవ్వా వృషాద్రిపతి, బాబావలీరావు, రావి రంగారావు, కానుమూరి సీతారామయ్య, బండి నారాయణస్వామి, కర్రె జగదీశ్, ఎస్‌.వెంకట్రామిరెడ్డి (సాహిత్యం), చెన్నుపాటి శ్రీనివాస్, వి.సూరిబాబు (శిల్పకళ), పి.చంద్రశేఖర్ (బ్రిక్‌ మేకింగ్‌), బి.రవి, టి.శీనయ్య (డప్పు వాయిద్యం), సాయి హేమంత్ (సంగీతం), కట్టా మురళీకృష్ణ (బుర్రకథ), జె.బాలక్, సీబీఎస్‌ జాహ్నవి, బాబూ బాలాజీ (కూచిపూడి నృత్యం), కొలకలూరి మధుజ్యోతి (సాహిత్యం), వి.భూదేవి (సింగర్‌), ఆర్‌డీఎన్‌ (ప్రవచన కర్త), బి.రంగమ్మ (తోలు బొమ్మలాట), కె.నటరాజ్‌ నాయుడు (లైబ్రరీ ఆర్ట్స్‌), వలీ సాహెబ్ (నటన), కె.వెంకయ్య (చెక్క భజన), నార్ల మధురిమ (నృత్యం), టి.యశోద (వైలాసినిడ్యాన్స్‌), కదిరి నరసింహారావు(జెమాలజిస్ట్‌).



గొల్లపూడికి ’కళారత్న’  అవార్డు

విజయవాడ కల్చరల్‌/సాక్షి, అమరావతి : సినీ నటుడు, రచయిత, దర్శకుడు గొల్లపూడి మారుతీరావుకు 2017 సంవత్సరానికి గానూ కళారత్న పురస్కారం లభించింది. ఉగాది సందర్భంగా ఏపీ ప్రభుత్వం కళారత్న (హంస) పురస్కారాలను వివిధ రంగాలకు చెందిన వారికి అందిస్తున్నట్లు భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ డి.విజయభాస్కర్‌ మంగళవారం ’సాక్షి’కి తెలిపారు. గొల్లపూడితో పాటు 38 మందికి కళారత్న పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఉదయం జరిగే ఉగాది వేడుకల్లో పురస్కార గ్రహీతలకు రూ.50 వేల నగదు అందజేసి ప్రభుత్వం సన్మానించనుంది.



పురస్కారాల గ్రహీతలు వీరే...

పొత్తూరి వెంకటేశ్వరరావు (జర్నలిజం), గరికపాటి నరసింహారావు (అవధానం), డాక్టర్‌ సాయికృష్ణయాచేంద్ర (సంగీతావధానం), వంగపండు ప్రసాదరావు (జానపదం), వేమూరి వెంకట విశ్వనా«థ్‌ (సంగీతం), చెరుకూరి వీరయ్య (ఇంజినీరింగ్‌), బల్లెం రోశయ్య (ఇంజినీరింగ్‌), అనంత శ్రీరామ్‌ (సినీగేయ రచయిత), ఉమా చౌదరి(హరికథ), మహంకాళి సూర్యనారాయణశాస్త్రి (కూచిపూడి), శారదా రామకృష్ణ (ఆంధ్రనాట్యం), చిత్తూరు రేవతి రత్నస్వామి (సంగీతం ఓకల్‌), కృష్ణ , సుభానీ (నాదస్వరం), సింగమనేని నారాయణ (సాహిత్యం), పి.సత్యవతి (సాహిత్యం), కె.సంజీవరావు (పద్యం), గంగాధర శాస్త్రి (సంగీతం), మునిపల్లి రుషికేశవరావు (సాహిత్యం), మీరమని శ్రీనివాసరావు (చిత్రలేఖనం), ఎస్‌ఎం పీరన్‌ (శిల్ప కళ), శ్రీజయన్న (చిత్రలేఖనం), కడలి సురేష్‌ (నాటకం), ఆకెళ్ల శ్రీరామ్‌ (శిల్పం), నేతి పరమేశ్వరరావు (నాటకం), పల్లేటి లక్ష్మీకులశేఖర్,(నాటకం), ఉమామహేశ్వరి (హరికథ), ఎ.మురళీకృష్ణ (యాంకరింగ్‌), తుమ్మపూడి కోటేశ్వరరావు (సాహిత్యం), డాక్టర్‌ టీఎస్‌ రావు (సామాజిక సేవ), ఎం.వెంకటరాయుడు (సామాజిక సేవ), శివప్రసాద్‌రెడ్డి (హరికథ), మీగడ రామంలింగస్వామి (రంగస్థలం), పొట్లూరి హరికృష్ణ (తెలుగు భాషా సేవ), కొండపోలు బసవ పున్నయ్య (సామాజిక సేవ), డాక్టర్‌ రాధాకృష్ణంరాజు (సామాజికసేవ), నాయుడు గోపి (రంగస్థలం), సతీష్‌ రెడ్డి (శాస్త్ర, సాంకేతిక రంగం).



వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్లకు ఉగాది పురస్కారాలు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్‌ గెడ్డం సునీల్‌ కుమార్‌బాబు, డాక్టర్‌ దేవన భాస్కరరావులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గెడ్డం సునీల్‌ కుమార్‌ ప్రస్తుతం వ్యవసాయ పాలిటెక్నిక్‌ విభాగం కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌ దేవన భాస్కరరావు ప్రస్తుతం వ్యవసాయ వర్సిటీ డీన్‌గా వ్యవహరిస్తున్నారు. పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్, ప్యాడీ డ్రైయ్యర్‌ను రూపొందించడంలో ఆయన కృషి చేశారు. వీరిద్దరికి ఉగాది పురస్కారాలు లభించడంతో వర్సిటీ వీసీ బి.రాజశేఖర్, రిజిస్ట్రార్‌ టీవీ.సత్యనారాయణ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top