ఏపీ డీఎస్సీ–2018 షెడ్యూల్‌ విడుదల  | AP DSC -2018 Schedule Released | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీ–2018 షెడ్యూల్‌ విడుదల 

Dec 7 2017 2:04 AM | Updated on Dec 7 2017 4:54 AM

AP DSC -2018 Schedule Released - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 15న డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం జూన్‌ 11 నాటికి ఎంపికైనవారికి నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. మార్చి 23, 24, 26 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న 10,313 స్కూల్‌ అసిస్టెంట్స్, ఎస్‌జీటీ, లాంగ్వేజ్‌ పండిట్స్, పీఈటీ తదితర పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెండు కేటగిరీల్లో అదనపు పోస్టులు 860, ఆదర్శ పాఠశాలల్లో 1197 ఖాళీలు కలిపి మొత్తం 12,370 పోస్టులు భర్తీ చేయనున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement