సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ? | AP CPM State Secretary P.Madhu takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ?

Oct 24 2014 11:08 AM | Updated on Aug 18 2018 6:18 PM

సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ? - Sakshi

సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ?

హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభలా నిర్వహిస్తోందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు.

విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభలా నిర్వహిస్తోందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు. శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాలలో మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ అంశంలో దాటివేత దోరణి అవలంభిస్తుందని ఆరోపించారు.  రైతులు ఇప్పటికే రుణమాఫీ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement