వైఎస్‌ జగన్‌ రేపు పోలవరం సందర్శన

AP CM YS Jagan Mohan Reddy Visits Polavaram Project Tomarrow said By Minister Anil yadav - Sakshi

పశ్చిమగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని జలవనరుల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌  మాట్లాడుతూ.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో సహా మొత్తం అన్ని అంశాలపై వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. జూలై 15 తర్వాత వచ్చే వరదల బారిన పడే అవకాశమున్న 48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు.

గడిచిన 6 నెలల్లో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో జరిగిన పనులను పరిశీలించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టుల పరిస్థితి సమీక్షిస్తామని పేర్కొన్నారు. రేపు వైఎస్‌ జగన్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter






Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top