
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప చేరుకున్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ హరికిరణ్, కర్నూల్ రేంజ్ డీఐజీ, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు ఘనస్వాగతం పలికారు. (అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే: సీఎం జగన్)
ఇడుపులపాయకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి పయనమయ్యారు. రేపు(బుధవారం) వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి నివాళులర్పించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్సార్ విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తిరిగి సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు.