అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట అంగన్ వాడీలు వేర్వేరుగా ధర్నా, సమ్మె నిర్వహించారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా.. సమ్మె
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట అంగన్ వాడీలు వేర్వేరుగా ధర్నా, సమ్మె నిర్వహించారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా.. సీఐటీయూ ఆధ్వ ర్యంలో సమ్మె చేశారు. అనంతరం కలెక్టరేట్ గేట్ ఎదుట రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. జీవో 24 రద్దు చేయాలని, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు కార్యకర్త లకు రూ.12,500, ఆయాలకు రూ.8 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లే కుండా పెండింగ్‌లో ఉన్న ఎనిమిది నెలల కేంద్రాల అద్దె చెల్లించాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐకేపీ జోక్యా న్ని నివారించాలని, అమృతహస్తం పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఈ నెల 22 వరకు కొనసాగుతుందని, ఈ నెల 21న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఏఐటీయూసీ ఆందోళనలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విలా స్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి రాధ, ప్రభ, కార్యకర్తలు, ఆయాలు, సీఐటీ యూ సమ్మెలో నాయకులు మల్లికాంబ, పద్మ, పుష్ప, క ళావతి, పార్వతి, సునీత, మంజుల పాల్గొన్నారు. కాగా, ఆయా డిమాండ్లతో జిల్లాలోని తహశీల్దార్ కార్యాల యాల ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు.