ఏపీకి మళ్లీ ఉపద్రవం రాబోతోంది: బొత్స | Andhra Pradesh is going to face calamity, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

ఏపీకి మళ్లీ ఉపద్రవం రాబోతోంది: బొత్స

Sep 10 2014 2:04 PM | Updated on Sep 2 2017 1:10 PM

ఏపీకి మళ్లీ ఉపద్రవం రాబోతోంది: బొత్స

ఏపీకి మళ్లీ ఉపద్రవం రాబోతోంది: బొత్స

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ అలాంటి ఉపద్రవమే రాబోతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ అలాంటి ఉపద్రవమే రాబోతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే తాము నందిగామ ఉప ఎన్నికల్లో పోటీకి తలపడుతున్నామని ఆయన చెప్పారు.

చంద్రబాబు మాటలకు, ఆయన మంత్రులు చెప్పే మాటలకు పొంతన ఉండట్లేదని మండిపడ్డారు. రాజధాని ఎక్కడైనా తమకు ఫర్వాలేదు గానీ, దాన్ని ప్రకటించిన తీరు మాత్రం బాగోలేదని ఆయన అన్నారు. రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దురదృష్టకరమని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement