ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం తొలి విడతలో 30 వేల ఎకరాలను సమీకరించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం..
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం తొలి విడతలో 30 వేల ఎకరాలను సమీకరించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం.. ఈ నెలాఖరులో రెండో విడత కోసం గ్రామాలను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లోని 20కి పైగా గ్రామాల్లో 14 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాగా రాజధాని సలహా కమిటీ శనివారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో భూ సమీకరణకు ఆయా గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. అలాగే తుళ్లూరు, మంగళగిరి మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తమ కమిటీలో చోటు కల్పించే అంశం పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.