రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం | andhra pradesh cabinet meeting starts | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం

Feb 10 2014 9:16 AM | Updated on Sep 2 2017 3:33 AM

రాష్ట్రమంత్రి వర్గం సోమవారం సమావేశం అయ్యింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరుగుతున్న సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

హైదరాబాద్ : రాష్ట్రమంత్రి వర్గం సోమవారం సమావేశం అయ్యింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరుగుతున్న సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు వ్యయానికి సంబంధించి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పిస్తారు. బడ్జెట్‌ సమర్పణ ముగియగానే బుధవారం నాటికి అసెంబ్లీని వాయిదా వేస్తారు. బడ్జెట్‌పై అధ్యయనం చేయడానికి మంగళవారం నాడు సభకు సెలవు ప్రక్రించారు. తిరిగి అసెంబ్లీ బుధవారం సమావేశమవుతుంది. 13వ తేదీతో సమావేశాలు ముగుస్తున్నాయి. ఆతర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement