కరోనా నిర్దారణ టెస్టుల్లో ఏపీ మెరుగు | Andhra Pradesh Better In Doing Coronavirus Tests | Sakshi
Sakshi News home page

కరోనా నిర్దారణ టెస్టుల్లో ఏపీ మెరుగు

Apr 17 2020 6:39 AM | Updated on Apr 17 2020 7:29 AM

Andhra Pradesh Better In Doing Coronavirus Tests - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో దేశంలో మన రాష్ట్రం టాప్‌–5లో ఉందని, రోజుకు 90 టెస్టుల స్థాయి నుంచి 3వేలకు పైగా టెస్టులు చేసే స్థాయికి సామర్థ్యాన్ని పెంచుకున్నామని గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అన్నారు. దేశంలో మిలియన్‌ జనాభాకు సగటున 198 పరీక్షలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో 331 మందికి చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ మందికి టెస్టులు చేస్తేనే ఇన్ఫెక్షన్‌ రేటు తెలుస్తుందని, అందుకే ఎక్కువ మందికి పరీక్షలు చేసి వైరస్‌ను నియంత్రించేందుకు ముందుకు వెళుతున్నట్టు పేర్కొన్నారు. ప్రధానంగా క్లస్టర్‌ కంటైన్‌మెంట్, మెరుగైన వైద్యం ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే... 

ఎక్కువ టెస్టులే లక్ష్యం 

  • పాజిటివ్‌ కేసులుగా ఉన్నవి 154 క్లస్టర్‌లుగా గుర్తించాం. ఇక్కడ కంటైన్‌మెంట్‌  చేయడమే ప్రధాన లక్ష్యం 
  • ఈ నెల 7వ తేదీ నాటికి 3930 పరీక్షలు చేయగా.. గురువారం నాటికి 16,550 టెస్ట్‌లు  
  • ర్యాపిడ్‌ డయాగ్నిస్టిక్‌ కిట్స్‌ రాగానే టెస్టుల సంఖ్య భారీగా పెంచుతాం 
  • ప్రస్తుతం ట్రూనాట్‌ కిట్‌ల ద్వారా 49 సెంటర్లలో రోజుకు 4వేల టెస్టులు. 
  • రోజుకు 17వేల టెస్టులకు పైగా చేయాలనేదే లక్ష్యం.  
  • ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పూలింగ్‌ విధానంలో ఒక టెస్టు స్థానంలో ఐదు టెస్టులు. 
  • 20వ తేదీ తర్వాత కరోనా ప్రభావిత మండలాల ప్రాతిపదికన రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్‌లను నిర్ణయించి ఆమేరకు ఆంక్షలు సడలింపు.  
  • కేసుల నమోదు బట్టి జోన్‌ల పరిస్థితిలో మార్పులు. 

క్వారంటైన్‌లు కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా

  • కేసులు పెరిగితే ప్రస్తుతం నిర్వహిస్తున్న క్వారంటైన్‌ సెంటర్లనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్పు.  
  • 80 శాతం మంది క్వారంటైన్‌నుంచే వైరస్‌నుంచి విముక్తి పొంది వెళ్లచ్చు..ఇక్కడ 460 మంది ఆయుష్‌ డాక్టర్ల నియామకం. 
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వివరాల కోసం చాట్‌బాట్‌ పేరుతో 8297104104 నంబర్‌ను ఇచ్చాం. 
  • అందుబాటులో1.35 లక్షలు పీపీఈలు, 1.16 లక్షలు ఎన్‌95 మాస్కులు. 
  • రోగులకు ఇబ్బంది లేకుండా ఆక్సిజన్‌ వ్యవస్థ పునరుద్ధరణ 
  • ప్రస్తుతం రాష్ట్రంలో క్వారంటైన్‌ కేంద్రాల్లో 6076 మంది.  
  • ఇవి గాకుండా అందుబాటులోకి 17445 సింగిల్‌ రూమ్‌ లు, 19362 డబుల్‌ రూమ్‌లు.  
  • హౌస్‌హోల్డ్‌ సర్వేలో 32700 మందికి లక్షణాలున్నాయని గుర్తింపు. వీరందరికీ వారంలోగా నిర్ధారణ పరీక్షలు పూర్తి.  
  • కరోనా పాజిటివ్‌తో వచ్చే వాళ్లే కాకుండా 60 ఏళ్లు దాటిన వారు ఆరోగ్య సమస్యలతో వచ్చినా వారినీ కోవిడ్‌ ఆస్పత్రులకే రావాలని సూచన.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement