కోవిడ్‌ కట్టడిలో 'ఏపీ'నే బెస్ట్‌

Andhra Pradesh Is Best In Covid-19 Prevention - Sakshi

ఐదుకోట్ల జనాభా దాటిన పది రాష్ట్రాల్లోని గణాంకాలే ఇందుకు నిదర్శనం

65.82 శాతం రికవరీ రేటుతో మిగతా రాష్ట్రాలకు అందనంత దూరంలో ఏపీ

0.92 శాతం అతితక్కువ ఇన్ఫెక్షన్‌ రేటుతో మొదటి స్థానం

3టీ ఫార్ములాతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తున్న రాష్ట్రం

రాష్ట్ర నమూనాను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు

అతి తక్కువ ఇన్ఫెక్షన్‌ రేటు, రికవరీ రేటులో రాష్ట్రానిదే మొదటిస్థానం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. 5 కోట్లు జనాభా దాటిన పది రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. అత్యధిక పరీక్షలు చేయడంతోపాటు అతి తక్కువ ఇన్ఫెక్షన్‌ రేటు (పరీక్షించిన వారిలో వ్యాధి సోకిన వారి సంఖ్య), రికవరీ రేటు విషయంలో ఏపీ ఎంతో ముందుంది. దేశంలో 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాల్లో గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్‌ రేటు 0.92 శాతంగా ఉంది. 1.01 శాతం ఇన్ఫెక్షన్‌ రేటుతో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. దేశ సగటు ఇన్ఫెక్షన్‌ రేటు 4.48 శాతంగా ఉండడం గమనార్హం. అత్యధికంగా ఇన్ఫెక్షన్‌ రేటు సోకిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర (13.64 శాతం), గుజరాత్‌ (7.68 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

3టీ వ్యూహంతో కట్టడి..
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ 3టీ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేసింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌(మూడు టీలు–అనుమానితుల గుర్తింపు, పరీక్షలు చేయడం, తగిన చికిత్స అందించడం) విధానాన్ని పటిష్టంగా అమలు చేయడమే ఈ ఫలితాలకు కారణమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో పలు దఫాలు సర్వేలు చేయడం ద్వారా కరోనా వైరస్‌ లక్షణాలున్న అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించింది. పాజిటివ్‌ లక్షణాలున్న వారిని కోవిడ్‌ హాస్పిటల్స్‌కు తరలించి అత్యున్నతమైన వైద్యసాయంతో వేగంగా కోలుకునేలా చేస్తోంది. అంతేకాదు.. వైరస్‌ సోకిన వ్యక్తితో నేరుగా సంబంధాలున్నవారిని, అతను కలిసిన వారిని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కాంటాక్టు కేసులను వేగంగా గుర్తించి వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. ఈ విధానం సత్ఫలితాలిస్తుండటంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు క్రమేపీ తగ్గుతున్నాయి. యాక్టివ్‌ క్లస్టర్ల సంఖ్య తగ్గుతూ గ్రీన్‌జోన్ల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఈ 3టీ విధానం సత్ఫలితాలిస్తుండడంతో మిగిలిన రాష్ట్రాలూ ఏపీ నమూనాను అనుసరిస్తున్నాయి.

రికవరీలోనూ రాష్ట్రమే ఫస్ట్‌..
ఇక రికవరీ రేటు విషయంలో 65.82 శాతంతో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. రికవరీ రేటు విషయంలో ఏ రాష్ట్రమూ ఏపీ దరిదాపుల్లోనే లేవు. 56.61 శాతం రికవరీ రేటుతో ఉత్తరప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (28.40 శాతం), బిహార్‌ (26.27 శాతం), కర్ణాటక (31.04 శాతం)లు అత్యంత వెనుకబడి ఉన్నాయి. దేశీయ సగటు రికవరీ రేటు 41.28 శాతంగా ఉంది. 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రికవరీ రేటు 58.91 శాతంగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-07-2020
Jul 05, 2020, 08:58 IST
సాక్షి, సంగారెడ్డి/ మునిపల్లి (అందోల్‌): ఆఫ్రికా నుంచి కందులు దిగుమతి చేసుకోవడం ఏమిటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర...
05-07-2020
Jul 05, 2020, 04:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,000 దాటింది. ఆస్పత్రుల నుంచి శనివారం 376 మంది...
05-07-2020
Jul 05, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎమ్‌ఎల్‌హెచ్‌పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ...
05-07-2020
Jul 05, 2020, 02:56 IST
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఇది అవసరమని భావిస్తోంది. నిజం...
05-07-2020
Jul 05, 2020, 02:43 IST
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో పదినెలల పసిపాపకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మండల వైద్యాధికారి...
05-07-2020
Jul 05, 2020, 02:33 IST
సాక్షి, హైదరాబాద్ ‌: వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా,...
05-07-2020
Jul 05, 2020, 02:22 IST
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం...
05-07-2020
Jul 05, 2020, 02:17 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తూ కేంద్ర...
05-07-2020
Jul 05, 2020, 02:16 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాల ద్వారా ఒక నగరం...
05-07-2020
Jul 05, 2020, 02:11 IST
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో 33 గంటల లాక్‌ డౌన్‌ ప్రకటించింది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
05-07-2020
Jul 05, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభి స్తూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా మరో 1,850 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి....
05-07-2020
Jul 05, 2020, 01:42 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది....
05-07-2020
Jul 05, 2020, 01:22 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు చెదిరిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం...
05-07-2020
Jul 05, 2020, 00:57 IST
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారత్‌ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ...
04-07-2020
Jul 04, 2020, 20:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో...
04-07-2020
Jul 04, 2020, 20:04 IST
పట్నా : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు భయాందోళనకు గురవతున్నారు....
04-07-2020
Jul 04, 2020, 18:41 IST
లక్నో : ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపై ఓ బీజేపీ నేత విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి చెందిన తనకే సూక్తులు...
04-07-2020
Jul 04, 2020, 17:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ బయోటెక్‌ టీకా ప్రయత్నాలపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి...
04-07-2020
Jul 04, 2020, 17:27 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు...
04-07-2020
Jul 04, 2020, 15:39 IST
పుణె : కరోనా వైరస్‌ పుణ్యమా అని మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ లోషన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. మాస్క్‌ లేనిదే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top