ఎండలో ఎలా వెళ్తావు తల్లీ.. | Anantapur Police Helps Pregnant Woman | Sakshi
Sakshi News home page

ఎండలో ఎలా వెళ్తావు తల్లీ..

Apr 21 2020 8:18 AM | Updated on Apr 21 2020 8:18 AM

Anantapur Police Helps Pregnant Woman - Sakshi

బాలింతకు వాహనం ఏర్పాటు చేసి పంపుతున్న పోలీసులు

కళ్యాణదుర్గం టౌన్‌: లాక్‌డౌన్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు బాలింతకు వాహనం సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని హిందూపురం రోడ్డులో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ వెంకటరమణ.. ఓ బాలింత ద్విచక్రవాహనంపై వెళ్లడం చూసి చలించిపోయారు. వెంటనే వారిని ఆపి తమ వాహనం సమకూర్చి ఇంటికీ క్షేమంగా పంపారు. మండల పరిధిలోని ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ ఈనెల 13న కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు డిశ్చార్జ్‌ చేయడంతో భర్త ప్రసాద్‌తో కలిసి బిడ్డతో ఎండలో ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు. గమనించిన డీఎస్పీ వెంకటరమణ తన వాహనంలో బాలింతను   క్షేమంగా ఇంటికి చేర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement