వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు | anantapur congress leaders joined in YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు

May 23 2017 2:26 PM | Updated on Jul 25 2018 4:42 PM

వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు - Sakshi

వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు

ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి.

పులివెందుల: ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నేతలు, సామాన్యులు అమితాసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన అనిల్‌ చౌదరి, మంజునాథ చౌదరి సహా 500 కుటుంబాలకు చెందినవారు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి వీరికి సాదరస్వాగతం పలికారు. జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని వీరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement