జైల్లో సెల్ఫోన్ కలకలం: వార్డెన్ సస్పెండ్ | anantapur central jail warder suspended | Sakshi
Sakshi News home page

జైల్లో సెల్ఫోన్ కలకలం: వార్డెన్ సస్పెండ్

Jun 25 2016 9:23 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా జైలులో సెల్ఫోన్ కలకలం రేపింది. జైలులోని ఖైదీలు సిబ్బంది సహకారంతో సెల్ ఫోనులు వాడుతున్నారన్న సమాచారం జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డికి చేరింది.

అనంతపురం : అనంతపురం జిల్లా జైలులో సెల్ఫోన్ కలకలం రేపింది. జైలులోని ఖైదీలు... సిబ్బంది సహకారంతో సెల్ ఫోనులు వాడుతున్నారన్న సమాచారం జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డికి చేరింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. జైల్ వార్డెర్ హరినాథ్ సాయంతో ఖైదీలు సెల్ఫోన్ వినియోగిస్తున్నట్లు సదరు విచారణలో అధికారులు గుర్తించారు.

దీంతో వార్డెర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తు జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జైలులో విచారణలో ఉన్న ఓ దొంగతో ఇద్దరు పత్రికా ప్రతినిధులు సెల్ ఫోనులో మాట్లాడినట్లు ఈ విచారణలో బహిర్గతమైంది.

Advertisement
 
Advertisement
Advertisement