మందుగుండు పేలి నలుగురికి తీవ్ర గాయాలు | Ammunition exploded - four serious injuries | Sakshi
Sakshi News home page

మందుగుండు పేలి నలుగురికి తీవ్ర గాయాలు

Nov 14 2015 4:28 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి పేలి నలుగురుతీవ్రంగా గాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు జరిగింది. కూరాసుల వీధిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి 70 శాతం కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి 40 శాతం కాలిన గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement