చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం | ambati slams chandrababu over DOPT Puts break for Kapu Reservations Bill | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం

Published Thu, Feb 15 2018 1:32 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM

ambati slams chandrababu over DOPT Puts break for Kapu Reservations Bill - Sakshi

సాక్షి, కాకినాడ : కాపు రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాగాకాపు రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లపై ఇందుకు డీఓపీటీ ...కేంద్ర హోంశాఖకు రాసిన లేఖే ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబు చేసిన తీర్మానంలో పసలేదని డీవోపీటీ చెప్పిందని, మంజునాథ కమిషన్‌ తన నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు హడావుడిగా కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. అందుకే ఆ తీర్మానంపై డీవోపీటీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. చంద్రబాబు మరోసారి కాపులకు ద్రోహం చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో కాపులకు బీసీ రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement