కొత్త కాలేజీలకు ఏఐసీటీఈ నోటిఫికేషన్ | AICTE notification for new colleges | Sakshi
Sakshi News home page

కొత్త కాలేజీలకు ఏఐసీటీఈ నోటిఫికేషన్

May 11 2014 12:54 AM | Updated on Oct 20 2018 7:44 PM

2014-15 విద్యాసంవత్సరంలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపు, అనుమతి పొడిగింపు, స్థలం, పేరు మార్పు, మూసివేత తదితరాలకు సంబంధించి అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శనివారం నోటిఫికేషన్ జారీచేసింది.

ఈనెల 18 వరకు దరఖాస్తుల ఆహ్వానం
 
 సాక్షి, హైదరాబాద్: 2014-15 విద్యాసంవత్సరంలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపు, అనుమతి పొడిగింపు, స్థలం, పేరు మార్పు, మూసివేత తదితరాలకు సంబంధించి అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. కాలేజీల ఏర్పాటుకు గుర్తింపు యూనివర్సిటీలు ఇ స్తాయని, అయితే వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు ఏఐసీటీఈ అనుమతి కూడా తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2014-15 విద్యా సంవత్సరంలో సాంకేతిక విద్యా కోర్సులతోపా టు మేనేజ్‌మెంట్ కోర్సుల నిర్వహణకు ఏఐసీటీఈ ఆమోదంతోపాటు యూనివర్సిటీల గుర్తింపు కచ్చితంగా ఉండాలని వెల్లడించింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ తదితర డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రారంభానికి అనుమతి తీసుకోవాలని సూచించింది. 2013-14 హ్యాండ్ బుక్‌లో ఉన్న వివరాలు, రూల్స్ 2014-15కు వర్తిస్తాయని తెలిపింది.


 ఎట్టకేలకు ఏఐసీటీఈకి..: ఏఐసీటీఈ కేవలం సలహా సంస్థ మాత్రమేనని, ఇంజ నీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల నియంత్రణ అధికారం ఆ సంస్థకు లేదంటూ గతంలో ఇంజనీరింగ్ కాలేజీలు తనను ఆశ్రరుుంచిన సవుయుంలో సుప్రీంకోర్టు వుధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కాలేజీల అనుమతుల వ్యవహారాలన్నీ యూనివర్సిటీలే చూడాలని యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు చర్యలు చేపడుతుండగా, ఏడాది పాటు కొత్త కాలేజీల అనుమతులు ఇవ్వొద్దని యూజీసీ మారటోరియం విధిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో తమ అనుమతి తప్పనిసరి అని ఏఐసీటీఈ పేర్కొంది.
 
 ఇదీ షెడ్యూలు..
 
 ఈనెల 18 వరకు కొత్త సాంకేతిక విద్య కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
 19న స్క్రూటినీ. 23న రీ స్క్రూట్నీ
 మే 20 నుంచి రీజినల్ కార్యాలయాల తనిఖీలు
 జూన్ 3 నుంచి రికమండేషన్స్
 పాత కాలేజీలకు కూడా 18వరకు అనుమతి పొడగింపునకు దరఖాస్తుల సబ్మిషన్‌కు అవకాశం.
 19 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement