నెల్లూరులో అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో | agrigold depositors rastaroko at nellore distirict | Sakshi
Sakshi News home page

నెల్లూరులో అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో

Aug 3 2015 11:15 AM | Updated on May 28 2018 3:04 PM

అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం భారీ ఎత్తున నిరసన తెలిపారు.

నెల్లూరు: అగ్రిగోల్డ్  బాధితులు సోమవారం భారీ ఎత్తున నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ బాధితులు నెల్లూరు జిల్లా బుజబుజనెల్లూరు వద్ద జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో 5 కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మద్ధతు తెలిపాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులతో కలిసి రాస్తారోకో చేశారు. ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement