పీఠాధిపతులు సుయతీంద్రతీర్థుల ఆశీస్సులతో గురువారం శ్రీమఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి.
మంత్రాలయం, న్యూస్‌లైన్ : పీఠాధిపతులు సుయతీంద్రతీర్థుల ఆశీస్సులతో గురువారం శ్రీమఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా రాఘవేంద్రుల మూలబృందావనానికి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం పీఠాధిపతి బంగారు రథానికి పూజలు నిర్వహించి రథోత్సవాలకు అంకురార్పణ పలికారు. మూలరాముల ప్రతిమను వెండి అంబారీ, రాఘవేంద్రుల ప్రతిమలను చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై కొలువుంచి ఏకకాలంలో రథోత్సవాలు నిర్వహించారు. రథాల ముందు బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమానికి భక్తులు వేలాదిగా త రలివచ్చారు.
శ్రీశైలంలో..: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో గురువా రం రథసప్తమి పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగం గా అమ్మవారి ఆలయప్రాంగణం యాగశాల దగ్గర సూర్యారాధన నిర్వహించారు. ముందుగా వేదికపై సూర్యయంత్రాన్ని లిఖించిన అనంతరం పూజాధికాలకు సంబంధించి సంకల్పం పఠించారు. అనంతరం కలశస్థాపన చేసి పూజలు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ గణపతిపూజ నిర్వహించారు. ఆయా బీజ మంత్రాలు, ప్రత్యేక ముద్రలతో సూర్య నమస్కారా లు చేసిన అనంతరంఅరుణపారాయణ, షోడశోపచార పూజాధికా లు జరిపించారు. చతుర్వేద పారాయణ చేసి సూ ర్యాభిషేక జలాన్ని భక్తులపై చల్లారు.
నందికొట్కూరు టౌన్: నందికొట్కూరు కోట వీధి సూర్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీసూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి కనుల పండువగా రథోత్సవం నిర్వహించారు.
అవుకు: అవుకు మండలం శివవరంలో వెలసిన సూర్యనారాయణ స్వామికి గురువారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయాన్నే అభిషేకం, ఆదిత్యహృదయ పారాణయం, భగవద్గీత పారాయణం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు.
మహానందిలో..
మహానంది, న్యూస్‌లైన్: మహానంది క్షేత్రంలో డీసీ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, ద్వాదశాదిత్యపూజలు, సూర్యనమస్కారాలు, త్రిచ, సూర్య, అరుణ పూజలు చేపటా ్టరు. వేదపండితులు రవిశంకరఅవధాని మాట్లాడుతూ రథంలో అష్టదిక్పాలకులు, బ్రహ్మదేవుడు, మహాకాళి అమ్మవారు, పార్వతీపరమేశ్వరులు, ఆదిదేవతలు కొలువై ఉంటారన్నారు. కార్యక్రమంలో సహా య కార్యనిర్వహణాధికారి ఎం.శివయ్య, అసిస్టెంట్ ఇంజినీర్ మురళీధర్‌రెడ్డి, సూపరింటెడెంట్లు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.