కర్నూలు: పార్టీ మారే ఆలోచన తనకు ఎప్పుడూ లేదన్నారు కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అదే సమయంలో సీఎం పదవి కూడా తాను ఏనాడు ఆశించలేదన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పార్టీ కోసం కష్టపడతానన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) మంత్రాలయం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు.
శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆహ్వానం మేరకు తాను మంత్రాలయం వెళ్లినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ఇందులో ఎటుంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. జోడో భారత్ యాత్రలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నానని, తమ పార్టీ అధికారం చేపట్టడంతో మళ్లీ రావడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ಓಂ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರಾಯ ನಮಃ
ಇಂದು ಮಂತ್ರಾಲಯ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನನ್ನ ಧರ್ಮಪತ್ನಿ ಅವರ ಜೊತೆ ಭೇಟಿ ನೀಡಿ, ಶ್ರೀ ಗುರುರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ದಿವ್ಯ ದರ್ಶನ ಪಡೆದು, ವಿಶೇಷ ಪೂಜೆ ಹಾಗೂ ತುಲಾಭಾರ ಸೇವೆಯನ್ನು ನೆರವೇರಿಸಲಾಯಿತು.
ಇದೇ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಮಂತ್ರಾಲಯ ಮಠಾಧೀಶರಾದ ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ,… pic.twitter.com/wf7yXISAxl— DK Shivakumar (@DKShivakumar) October 22, 2025
‘ఇదీ చదవండి:
మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు


