ఆ దొంగెవరో తెలిసింది | Accused theif identified by police in theft case | Sakshi
Sakshi News home page

ఆ దొంగెవరో తెలిసింది

Mar 27 2015 9:51 AM | Updated on Sep 2 2017 11:28 PM

నగరంలోని ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడెవరో పోలీసులు గుర్తించారు.

విజయవాడ: నగరంలోని ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడెవరన్నది పోలీసులు గుర్తించారు. చిక్కడు దొరకడు అన్నట్టుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆ ఘరానా దొంగ ఆనవాళ్లను పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.
 

1998లో దుర్గగుడిలో చోరీకి పాల్పడిన ప్రకాశ్ కుమార్ సాహునే నిందితుడిగా పోలీసులు నిర్థారించారు. అయితే నిందితుడు సాహు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement