ఏపీ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లపై ఏసీబీ దాడులు | ACB raids reveal fraud in SC,ST hostels | Sakshi
Sakshi News home page

ఏపీ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లపై ఏసీబీ దాడులు

Jul 10 2014 8:59 AM | Updated on Sep 15 2018 3:01 PM

ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ అతిథి గృహాలపై ఏసీబీ గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ అతిథి గృహాలపై ఏసీబీ గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని హాస్టళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు , కోట రామచంద్రాపురం, గుంటూరు జిల్లా రెంటచింతల, నెల్లూరు జిల్లా కలవాయి మండలం కుల్లూరు, అనంతపురం జిల్లా అనంతసాగరం మండలం రేవూరు, వైఎస్ఆర్ జిల్లా బద్వేలు, తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, అన్నవరం, చిత్తూరు జిల్లా తొట్టెంబేడు, రొంపిచర్ల మండలం నడింపల్లి, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ తనిఖీలు జరుపుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement