హైదరాబాద్: లంచం తీసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రూ.20 లక్షలు తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డితో పాటు సర్వేయర్ శ్రీనివాసులును కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ లంచం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ‘అంతా మా డాడీ చూసుకుంటాడు లే!’


