తల్లిదండ్రులు సంపాదించిన సొమ్ముతో విలాసాలు.. పుట్టినరోజు కానుకగా ఖరీదైన మినీ కూపర్.. రయ్‌రయ్‌మంటూ రోడ్లపై దూసుకెళ్లే వేగం! ఆ స్పీడే ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలిగొంది. ప్రమాదం తర్వాత అక్కడ గుమిగూడిన స్థానికులు కారు నడిపిన టీనేజర్‌ను నిలదీయగా.. ‘అంతా మా డాడీ చూసుకుంటాడు లే!’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం వాళ్లను దిగ్భ్రాంతికి గురి చేసింది.
కేరళలోని కొచ్చి విమానాశ్రయం సమీపంలో ఆదివారం వేకువ జామున జరిగిన ఘోర ప్రమాదం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురి ప్రాణాలను తీసింది. ప్రమాదంలో మరణించిన దేవిక (21), గోపిక (22), ఇయాస్ (21).. ఈ ముగ్గురూ త్రిక్కక్కరలో ఓ దుకాణంలో పని చేస్తూ చదువుకుంటున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీయడమే కాదు.. నిలదీసిన స్థానికులతోనూ 19 ఏళ్ల సుహైల్ సజీవ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
CCTV captures the moment when a speeding Mini Cooper killed three youths near Nedumbassery airport in Ernakulam. Accused driver Suhail Sajeev, 19, is in custody. Police are verifying the claim that he was driving at 218 kmph and examining forensic and technical evidence. #Kerala #RoadSafety
— Ashish (@KP_Aashish) October 12, 2026
ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరిలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని టీ తాగి ఆ ముగ్గురు ఒకే స్కూటర్‌పై ఇళ్లకు బయల్దేరారు. ఈలోపు వేగంగా వచ్చిన మినీ కూపర్ ఢీకొట్టింది. వయనాడ్‌కు చెందిన దేవిక, పాలక్కాడ్‌కు చెందిన గోపిక, అలాగే కర్ణాటకకు చెందిన ఇజాజ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

సుహైల్ బ్యాక్‌గ్రౌండ్
సుహైల్ తండ్రి సజీవ్ జమాల్ ప్రముఖ టెక్స్‌టైల్ వ్యాపారి. తల్లి నూహా సజీవ్ కొచ్చి, అలప్పుజాలో డిజైన్ స్టూడియో, బ్రాండ్ నిర్వహిస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు సజీవ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. దానిని తల్లి నూహా అతనికి పుట్టినరోజు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కానుకే ఇప్పుడు ముగ్గురి ప్రాణాలు తీసింది. సుహైల్ గతంలోనూ అత్యంత వేగంగా కారు నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. గంటకు 218 కిలోమీటర్ల వేగంగా కారు నడిపిన వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు.
#WATCH | Keralam | Three students killed in an accident involving a car and a scooter in Nedumbassery, Kochi. The police have detained the car driver, Suhail Sajeev, and registered a case. Visuals of the vehicles involved in the accident (11.10) https://t.co/eZRvm1ULuh
— ANI (@ANI) October 12, 2026
ఆస్పత్రి వద్ద దాడి
మరోవైపు, నిందితుడు సుహైల్‌పై మృతుల స్నేహితులు దాడికి యత్నించారు. ఆదివారం అతన్ని వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బయటకు తీసుకెళ్తున్న సమయంలో వెనుక నుంచి తలపై కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని దాడిని అడ్డుకోవడంతోపాటు, ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
సీసీటీవీ దృశ్యాల్లో ప్రమాద తీవ్రత
ప్రమాద దృశ్యాల్లో మినీ కూపర్ అధిక వేగంతో దూసుకొచ్చి రహదారికి ఎడమవైపు వెళ్తున్న స్కూటర్‌ను ఢీకొట్టినట్లు కనిపించింది. ఢీకొన్న వేగానికి స్కూటర్‌పై వెనుక కూర్చున్న మహిళ గాల్లోకి ఎగిరిపడింది. స్కూటర్ పూర్తిగా ధ్వంసమవగా, కారు కూడా తీవ్రంగా దెబ్బతింది. విమానాశ్రయ పరిసరాల్లో అతివేగంతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు పోలీసు పెట్రోలింగ్, ఇతర ముందస్తు చర్యలను పెంచుతామని అధికారులు తెలిపారు. రక్త పరీక్షల నివేదికలు, ఫోరెన్సిక్ పరిశీలన ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Aniyayama 3 uyiru poiduchu 😑 Appan karan 19th birthday gift Mini cooper vaangi kuduthanam night uh full ah kudichitu accident panitu irukkan 🤦🏼♂️ #Kerala https://t.co/xp1W4NV85V
— Alpha ! (@DMK662000) October 12, 2026
డ్రగ్స్ తీసుకున్నాడా?
ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా, కారు ముందు భాగంగా తీవ్రంగా దెబ్బతింది. కారు నడిపిన సుహైల్(19)ను స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోపు అతను అక్కడ వీరంగం సృష్టించారు. ప్రమాదానికి ముందు మద్యం సేవించినట్లు అతను పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. అయితే డ్రగ్స్ తీసుకున్నాడనే అనుమానాల నడుమ.. కారులో ఫోరెన్సిక్ బృందం పరిశీలనలు జరిపింది. అలాగే అతని బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపారు. ఆ టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: బిర్యానీ కొంటున్నారా? అయితే ఇది మీకేనంట!


