‘సీఎం జగన్‌ దేవుడిలా ఆదుకుంటున్నారు’

Aarogyasri Beneficiary Praises CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఒకప్పుడు డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోయామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడి రూపంలో తమని ఆదుకుంటున్నారని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు ఎన్‌.నారాయణ కొనియాడారు. సీఎం ఉచితంగా వైద్యసాయం అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో​ నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రితో తమ అనుభవాలను పంచుకున్నారు. (ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్‌)

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు : కె.నరేష్, పూడివలస, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా
‘ప్రతినెలా ఒకటో తేదీ కల్లా వాలంటీర్‌ వచ్చి తెల్లవారు ఆరోగంటకే నా ఇంటిగుమ్మం దగ్గరకి వచ్చి పింఛన్‌ ఇస్తున్నారు. దాంతో నేను నా భార్యా, పిల్లలు చాలా సంతోషంగా బతుకున్నాం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నా. నాకు ఒంట్లో ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రికి వెళితే డాక్టర్లు నీకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను, కానీ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్‌ చేస్తారని చెప్పారు. అంతే కాకుండా ఉచితంగా రూ.పదివేలు పింఛన్‌ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు’

ఎం. రామ్మోహన్‌ రెడ్డి, వేంపల్లె, కడప జిల్లా
‘ముఖ్యమంత్రిగారికి పాదాభివందనాలు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. డిసెంబరు 14వ తేదీన గుండెనొప్పి వచ్చింది, కడప వెళ్తే హైదరాబాద్‌ పోవాలన్నారు. హైదరాబాద్‌ పోయి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేపించుకున్నాం. ఆపరేషన్‌ చేపించుకున్న తర్వాత డిశ్చార్జ్‌ అయినంక ఎలా బతకాలని నాకు నిద్రపట్టేది కాదు. డిశ్చార్జ్‌ అయిన మరుక్షణమే రూ.9500 వైయస్సార్‌ ఆసరా కింద డబ్బులు పడ్డాయి.
చాలా సంతోషం అనిపించింది. ఇట్టాంటి పథకాలు మీకు(శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి) మాత్రమే వస్తాయనిపించింది. ఇలాంటి పథకాలు ఇంకా చేయాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను’

ఏఎన్‌ఎమ్ లత : ‘ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నాను. మీరు ప్రవేశపెట్టిన పథకాలనుప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో టెలిమెడిసన్‌ ద్వారా మేం మందులు ఇంటికి తీసుకెళ్లి రోగులకు ఇస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా సర్వే ఇంటింటికీ చేశాం. ఇప్పుడు ఐదో విడత చేస్తున్నాం. సిటిజన్‌ యాప్‌అని స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవాళ్లకి ఆ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేయిస్తున్నాం. గతంలో పదివేల మందికి ఒక ఏఎన్‌ఎం సర్వే చేసేవారం. ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా వచ్చిన ఏఎన్‌ఎంల సహాయంతో రెండు వేల మంది జనాభాకి సర్వే చేస్తున్నాం. మీకు ధన్యవాదములు’

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారు హేమ : ‘నా పాప పేరు హాసిని, పాపకి తలసేమియా, తనకి పింఛన్‌ వస్తుంది. దాన్ని నేను మాటల్లో చెప్పలేను, మా కుమార్తెకు పింఛన్‌ ఇచ్చి మా జీవితాల్లో మీరు వెలుగును చూపించారు. ఉచిత వైద్యం మాత్రమే కాదు నేనున్నానని భరోసా కల్పించారు. మీరు మాకు ఆశాజ్యోతి సార్‌. నా కృతజ్ఞతను ఎలాగైనా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మందులు విరివిగా దొరికేలా చేస్తారని నా మనవి. మా జగనన్నకి శతకోటి ప్రణామాలు’

వెంటనే జోక్యం చేసుకున్న సీఎం జగన్‌.. తలసేమియా వంటి పేషెంట్లకు పీరియాడికల్‌గా మందులు హోం డెలివరీ చేసే దిశగా ఆలోచించడమో.. లేక వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూడమని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

సత్యవాణి, అడ్డతీగల, రాజవొమ్మంగి, ఐసీడీఎస్‌ వర్కర్‌
‘మా ఏజెన్సీలో శిశుమరణాలు, బాలింత మరణాలు గతంలో ఎక్కువగా ఉండేవి. మీరు వచ్చిన తర్వాత వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం తీసుకోవడం వల్ల గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డకు జన్మనిస్తుంది. గర్భం దాల్చిన నుంచి వాళ్లు పుట్టిన తర్వాత పిల్లలకు కూడా పోషకాలు మీరు అందిస్తున్నారు. ఏజెన్సీలో  పనులుకు వెళ్తే గాని పూటగడవని స్ధితిలో ఉంటే ప్రభుత్వం మాకు ఉచితంగా రేషన్‌ ఇచ్చి ఆదుకున్నారు. మీకు ధన్యవాదములు. మాకు చాలా చోట్ల  అద్దె భవనాలున్నాయి. అంగన్వాడీ సెంటర్లకి కూడా శాశ్వత భవనాలు ప్రభుత్వం నిర్మించి ఇస్తే బాగుంటుంది. ఆసుపత్రులు నాడు–నేడు తరహాలో చేస్తే బాగుంటుంది. పేదవాడి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను.. మీరే పదికాలాలు పాటు సీఎంగా ఉండాలి సార్‌’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top