ప్రహసనంగా ప్రసాదాల తయారీ

ప్రహసనంగా ప్రసాదాల తయారీ

  • పంచాయతీ చెరువు నుంచి అడ్డగోలుగా నీటి మళ్లింపు

  •  అడ్డుకున్న మహిళా సర్పంచ్, గ్రామస్తులపై దౌర్జన్యం

  •  పోలీసులను సైతం లెక్క చేయని వైనం

  •  అధికార పార్టీ నాయకుడి నిర్వాకం

  •  పామర్రు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మాది.. మీకు చేతనైంది చేస్కోండి.. దిక్కున్నచోట చెప్పుకోండి.. ఏం జరుగుద్దో మీరే చూస్తారు.. ఇవీ అధికార పార్టీకి చెందిన ఓ నేత బెదిరింపులు. అంతేకాదు పంచాయతీ చెరువులోని నీటిని అక్రమంగా తోడేస్తుండటంపై ప్రశ్నించిన సర్పంచ్, గ్రామస్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు.



    పోలీసులపై సైతం బెదిరింపులకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో పంచాయతీ పరిధిలో 18 ఎకరాల చెరువు ఉంది. అదే గ్రామానికి చెందిన, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా చెలామణి అవుతున్న పొట్లూరి కృష్ణబాబు నిబంధనలకు విరుద్ధంగా ఆ నీటిని తన సొంత చెరువుల్లోకి తోడేస్తున్నారు.



    విషయం తెలుసుకున్న సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి, గ్రామస్తులు కారే ముసిలి, పొట్లూరి రామశాస్త్రులు, అట్లూరి వెంకటేశ్వరరావు, వేములపల్లి పూర్ణచంద్రరావు, సింగవరపు రామచంద్రరావు, కాకరాల కోటేశ్వరరావు, పొట్లూరి శివయ్య తదితరులు వెళ్లి నీటి మళ్లింపును అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పొట్లూరి కృష్ణబాబు అక్కడికి చేరుకుని వారితో వాగ్వివాదానికి దిగారు. ‘నా ఇష్టం వచ్చినట్లు తోడుకుంటాను.. అడ్డుకోండి చూస్తాను.. అధికారంలో ఉన్నది మేమే.. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు..’ అంటూ దౌర్జన్యానికి దిగారు.

     

    పోలీసులతోనూ వాగ్వాదం...



    ఈ ఘటనపై సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నీటి తరలింపుపై ఎస్సై విల్సన్ పొట్లూరి కృష్ణబాబును ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. అదే సమయంలో సీఐ శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని తమకు సర్పంచ్ నుంచి ఫిర్యాదు అందిందని, నీటి తోడకం చేయడానికి వీలులేదని కృష్ణబాబును వారించారు.

     

    దీంతో ‘మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందకుండా మీరు ఎందుకు వచ్చారు.. ఏం చేద్దామని వచ్చారు’ అంటూ సీఐని, ఎస్సైలను కృష్ణబాబు నిలదీశారు. అనంతరం సీఐ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది రాత్రంతా కాపలా ఉన్నారని గ్రామస్తులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని గ్రామస్తులకు ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు పంపగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా గ్రామానికి వచ్చి నీటి తవ్వకాలను అడ్డుకున్నారు.

     

    అవసరం తీరాకే.. ఆపేశారు..



    ఘటనాస్థలిలో రాత్రంతా పోలీసులు ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యమని గ్రామస్తులు తెలిపారు. ఓ పక్క పోలీసులు అక్కడ ఉండగానే నీరంతా సొంత చెరువుల్లోకి తరలించేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఎస్సై వచ్చి తవ్వకాలను ఆపేయాలని అనడంతో అప్పటికే పనులు పూర్తయిన నేపథ్యంలో ఇంజ న్లను తొలగించారని గ్రామస్తులు చెప్పారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top