భోగి పండుగ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ఉద్యోగ, కార్మికులు నగరంలోని వీధులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
తిరుపతి కార్పొరేషన్: భోగి పండుగ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ఉద్యోగ, కార్మికులు నగరంలోని వీధులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఉషాకుమారి భోగి మంటల వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.
శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య పర్యవేక్షణలో నగరంలోని భోగి మంటలను శుభ్రం పని యుద్ధప్రాతిపదికన చేయించారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు దాదాపు 95టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందుకోసం ఎనిమిది మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 40 మంది మేస్త్రీలు, 239 మంది శాశ్వత ఉద్యోగులు, 649 మంది కాంట్రాక్టు కార్మికులు సేవలు అందించారు.