అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం | 8 years boy kidnapped in anakapalli | Sakshi
Sakshi News home page

అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం

Apr 30 2016 9:54 AM | Updated on Jul 12 2019 3:29 PM

విశాఖ జిల్లా అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది.

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గౌరపాలెం ప్రాంతానికి చెందిన కొణతాల అజయ్(8) శుక్రవారం సాయంత్రం నుంచి  కనిపించడం లేదు. బాలుడి తల్లిదండ్రులు పలు చోట్లు వెతికినా లాభం లేకుండా పోయింది. అర్థ రాత్రయినా ఆచూకీ తెలియలేదు. అదే సమయంలో వారికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అజయ్ తమ చెరలో ఉన్నాడని, రూ. లక్ష ఇస్తే విడిచి పెడతామని బెదిరించారు. దీనిపై బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement