బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం | 70 Year Old Man molested Girl In East Godavari | Sakshi
Sakshi News home page

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

Sep 9 2019 8:49 AM | Updated on Sep 9 2019 8:49 AM

70 Year Old Man molested Girl In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(అనపర్తి) : స్థానిక ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన సుమారు పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఆదివారం అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌టీఆర్‌ కాలనీ పుల్లారెడ్డి గారి వీధిలో అనుపోజు ప్రసాద్‌ (70) తన భార్య వరలక్ష్మితో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్నాడు. గత నెల 25న ఆ ఇల్లు ఖాళీ చేసి రెండు వీధుల ముందర మరో ఇంట్లోకి అద్దెకు వెళ్లారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా షాపు వద్దకు ఆదివారం సాయంత్రం Výæతంలో ప్రసాద్‌ అద్దెకు ఉండే ఇంటికి సమీపంలో నివసించే బాలిక వచ్చింది. ఆమెను ప్రసాద్‌ తమ ఇల్లు చూసేందుకు రమ్మని పిలిచాడు. ఇంట్లోకి ఆమె వచ్చాక తలుపు గడియ వేసి ఆమె నోరు నొక్కి అత్యాచార యత్నం చేశాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన వరలక్ష్మి  కిటికీలోంచి చూసి భర్తపై కేకలు వేయగా ప్రసాద్‌ తలుపులు తెరిచి  పారిపోయాడు. తమకు ఏ విధమైన ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement