ఆటో బోల్తా; ఏడుగురికి గాయాలు | 7 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా; ఏడుగురికి గాయాలు

Mar 23 2015 7:03 PM | Updated on Sep 2 2017 11:16 PM

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండంలోని గుత్తివలస గ్రామ సమీపంలో సోమవారం ఓ ఆటో బోల్తా కొట్టింది.

విజయనగరం : విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండంలోని గుత్తివలస గ్రామ సమీపంలో సోమవారం ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొల్లా త్రినాథ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కోదుల గుమ్మడ గ్రామస్తులే.  ఉద్ధవోలు గ్రామానికి చెందిన వీరి బంధువు చనిపోయారని తెలిసి వారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement