రైలులో 50 కిలోల గంజాయి స్వాధీనం | 50 kg of marijuana seized by train | Sakshi
Sakshi News home page

రైలులో 50 కిలోల గంజాయి స్వాధీనం

Jun 9 2015 12:14 AM | Updated on Sep 3 2017 3:26 AM

రైలులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...

అనకాపల్లి రూరల్: రైలులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు బ్యాగ్‌లతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం మధ్యాహ్నం బోగీలు తనిఖీలు చేస్తుండగా అనీష్‌కుమార్ (బెంగుళూరు), మణి (ఢిల్లీ), మంగళ్ (ఛండీగఢ్)ల ప్రవర్తనలో మార్పులను గమనించిన రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులతోపాటు గంజాయి బ్యాగ్‌లను అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో దించి ప్రశ్నించారు.  విచారణకు వారిని విశాఖపట్నం తీసుకెళ్లినట్టు రైల్వే పోలీసులు కె. లక్ష్మణరావు, కె. రాజులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement