కారును ఢీకొన్న లారీ: ఐదుగురికి తీవ్రగాయాలు | 5 injured in road accident | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ: ఐదుగురికి తీవ్రగాయాలు

Oct 18 2015 10:22 AM | Updated on Aug 30 2018 3:56 PM

తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళుతున్న ఇండికా కారును రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొన్న సంఘటన శనివారం అర్థరాత్రి శింగనమల మరువకొమ్మ వద్ద జరిగింది.

శింగనమల (అనంతపురం జిల్లా) : తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళుతున్న ఇండికా కారును రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొన్న సంఘటన శనివారం అర్థరాత్రి శింగనమల మరువకొమ్మ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇండికా కారులో ప్రయాణిస్తున్న డ్రైవరుతో కలిపి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అనంతపురానికి చెందిన నలుగురు రియాజ్ అహమ్మద్, అతని భార్య, జహీర్ అహమ్మద్, సారాద్‌, డ్రైవరు కిశోరుబాబు కలిసి తాడిపత్రి నుంచి బయలుదేరారు. అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్లుతున్న లారీ శింగనమల మరువకొమ్మ వద్దకు రాగానే రాంగ్ రూట్‌లోకి వచ్చింది. కారులో ప్రయాణిస్తున్నవారు గుర్తించి రోడ్డు ప్రక్కకు వెళ్లేలోపే లారీ కారును ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, డ్రైవరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ కిందకు కారు వెళ్లడంతో అటుగా వచ్చిన శింగనమల వాసులు గుర్తించి అందరినీ బయటకు లాగారు. నార్పల నుంచి పేషెంట్‌తో వెళ్తున్న 108 వాహనం అటుగా రావడంతో.. 108 వాహనాన్ని ఆపి, తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ముగ్గురిని మరో 108 వాహనంలో తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement