కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని హరిజన పేటలో విషాదం చోటు చేసుకుంది.
అగ్నిప్రమాదంలో చిన్నారి సజీవదహనం
Feb 19 2016 8:43 AM | Updated on Sep 5 2018 9:45 PM
	నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని హరిజన పేటలో విషాదం చోటు చేసుకుంది.  స్థానికంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సజీవ దహనం అయింది. వివరాలు శుక్రవారం తెల్లవారుజామున విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి రెండు గుడిసెలు  పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు పరుగు తీసినా దురదృష్టవశాత్తూ నాలుగు నెలల శివానీ అనే పసిపాపను మాత్రం బయటకు తీసుకురాలేక పోయారు. దట్టంగా మంటలు విస్తరించడంతో కాసేపటికే చిన్నారి సజీవ దహనమైంది. పసిపాప మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
