ఆటో బోల్తా: నలుగురికి తీవ్రగాయాలు | 4 injured as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: నలుగురికి తీవ్రగాయాలు

Feb 11 2016 5:53 PM | Updated on Sep 3 2017 5:26 PM

టైర్ పంక్చరై ఆటో బోల్తాపడిన ఘటన మంత్రాలయం మండలంలోని చిలకలదోన గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది.

మంత్రాలయం (కర్నూలు) : టైర్ పంక్చరై ఆటో బోల్తాపడిన ఘటన మంత్రాలయం మండలంలోని చిలకలదోన గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వైపు వెళ్తున్న ఆటో టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది. డ్రైవర్ వీరేంద్ర,ప్రయాణీకులు భీమేశ్, నాగరాజు, హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement