రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత | 31 red sander smugglers arrested in ysr district | Sakshi
Sakshi News home page

రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

Jan 16 2016 12:34 PM | Updated on Aug 20 2018 4:27 PM

వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు.

రైల్వే కోడూరు: వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని శెట్టికుంట వద్ద తనిఖీలు చేయగా ఎర్రచందనంతో వెళ్తున్న వాహనాలను గుర్తించారు. అక్రమ రవాణా చేస్తున్న దాదాపు రూ. కోటి  విలువైన ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన 31 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఓ లారీ, కారు ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement