30 కేజీల గంజాయి పట్టివేత | 30 KG Ganja Seized in visakhapatnam district | Sakshi
Sakshi News home page

30 కేజీల గంజాయి పట్టివేత

Dec 16 2015 10:29 AM | Updated on Sep 3 2017 2:06 PM

విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement