ఆర్టీసీ బస్సు - లారీ ఢీ: 30 మందికి గాయాలు | 30 injured in bus - lorry accident, chittoor district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు - లారీ ఢీ: 30 మందికి గాయాలు

Dec 5 2014 10:58 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక  ఆర్టీసీకి చెందిన బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement