బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి | 3 years boy died in nellore distirict | Sakshi
Sakshi News home page

బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి

Apr 21 2015 10:19 AM | Updated on Oct 20 2018 6:04 PM

బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి - Sakshi

బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జలదంకి పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు. వివరాలు..పట్టణంలో పులుసు ప్రభాకర్, సుమతి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు శివకేశవ (3) మంగళవారం ఉదయం ఇంటి ముందున్న ఇసుకలో ఆడుకోవడానికి వెళ్లాడు. అంతలో అటువైపు విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ప్రతిభ పబ్లిక్ స్కూల్ బస్సు బాలుడు పై నుంచి వెళ్లింది. టైరు కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(జలదంకి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement