breaking news
jaladanki
-
ఆలయాల్లో వరుస చోరీలు
నెల్లూరు: గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రహ్మణకాక గ్రామంలోని సాయిబాబా, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ ప్రారంభించారు. (జలదంకి) -
బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జలదంకి పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు. వివరాలు..పట్టణంలో పులుసు ప్రభాకర్, సుమతి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు శివకేశవ (3) మంగళవారం ఉదయం ఇంటి ముందున్న ఇసుకలో ఆడుకోవడానికి వెళ్లాడు. అంతలో అటువైపు విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ప్రతిభ పబ్లిక్ స్కూల్ బస్సు బాలుడు పై నుంచి వెళ్లింది. టైరు కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (జలదంకి) -
ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు
- రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం: ఎమ్మెల్యే మేకపాటి జలదంకి, న్యూస్‌లైన్: ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు కావడం తథ్యమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నవరం, తిమ్మసముద్రం, కేశవరం, చింతలపాళెం, గట్టుపల్లి, 9వ మైలు, చిన్నక్రాక, నాగిరెడ్డిపాళెం, కోదండరామాపురం తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే అందరం వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఆల్‌ఫ్రీ అనే మాయమాటలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. వైఎస్సార్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్ సీఎం అయితే వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళల జీవితాలు మారుతాయన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తన సోదరుడు రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, రావిప్రసాద్, ఎస్వీ శేషారెడ్డి, మేకల మహేశ్వరావు, లేటి సుధీర్, గద్దె బ్రహ్మయ్య, గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు, ఇస్కామదన్ మోహన్‌రెడ్డి, వాకా మాధవరెడ్డి, గంగపట్ల మాలకొండయ్య, గుర్రం జగ్గయ్య, పులి మాల్యాద్రి, యడ్ల మాల్యాద్రిరెడ్డి, వట్టికాల బాలయ్య, బీవీ కృష్ణారెడ్డి, వాకా పద్మనాభరెడ్డి పాల్గొన్నారు.