ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్ | 3 Chain Snatchers arrested | Sakshi
Sakshi News home page

ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్

May 26 2015 6:40 PM | Updated on Aug 20 2018 4:27 PM

అనంతపురం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,86,000లు విలువ చేసే 92 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం సీఐ మధుభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముదిరెడ్డిపల్లికి చెందిన ఆర్.రాఘవేంద్ర(21), టి.మంజునాథ్(21),  పి.వెంకటేష్(21) అనే ముగ్గురు యువకులు జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని  విచారించగా అసలు విషయం బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement