‘సురుచి’ గిన్నిస్ రికార్డు | 29.465 kilos Laddu Guinness record to Suruchi Foods | Sakshi
Sakshi News home page

‘సురుచి’ గిన్నిస్ రికార్డు

Sep 30 2016 2:02 AM | Updated on Aug 21 2018 2:34 PM

గిన్నిస్ రికార్డును చూపిస్తున్న మల్లిబాబు - Sakshi

గిన్నిస్ రికార్డును చూపిస్తున్న మల్లిబాబు

తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ గాజువాకలోని గణనాథునికి సమర్పించిన29,465 కిలోల లడ్డూ సరికొత్త...

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం
తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ గాజువాకలోని గణనాథునికి సమర్పించిన29,465 కిలోల లడ్డూ సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. గుజరాత్‌లోని అంబాలాలో అరసూరి అంబాజీ మాత దేవస్థానం ట్రస్టు తయారు చేసిన 11,115 కిలోల లడ్డూ ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డుగా ఉండింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి గురువారం మెయిల్ వచ్చిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు మీడియాకు వెల్లడించారు. రూ.35 లక్షల విరాళాలతో తయారైన ఈ మహా లడ్డూను వినాయకుడి నిమజ్జనం తర్వాత దేశ విదేశాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇకపై తమ సంస్థ రికార్డు రేసుల్లో పాల్గొనబోదని, మహాలడ్డూల తయారీ చేపట్టబోదని స్పష్టం చేశారు.    - మండపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement