ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మొత్తం చెల్లించాలని, పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని...
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మొత్తం చెల్లించాలని, పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని, ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లను రూ. రెండు వేలకు పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న బీసీ విద్యార్థుల మహాగర్జనను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలి పారు. విద్యా సంవత్సరం మొదలై ఆరునెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ‘ఫాస్ట్’ కమిటీని వేసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదన్నారు.