breaking news
BC Student
-
లైంగికంగా వేధిస్తున్న కరస్పాండెంట్‌పై చర్య తీసుకోవాలి
రాజమహేంద్రవరం క్రైం : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కరస్పాండెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మురుకుర్తి దుర్గాప్రసాద్ యాదవ్, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం దక్షిణ మండల డీఎస్పీ కె.శ్రావణికి ఆమె కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరంలోని ఓ డిస్టెన్స ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడని, పలువురు తమకు ఫోన్ల ద్వారా తెలిపారని విద్యార్థి సంఘాల నాయకులు వివరించారు. దీనిపై ఆరా తీసేందుకు తాము ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లగా ఓ వ్యక్తి తమకు ఎదురై ‘ ఇలాంటివి ఇక్కడ చాలా జరుగుతాయి.. మీరేం చేయలేరు’ అని అన్నాడని తెలిపారు. కరస్పాండెంట్ వేధింపులకు సంబంధించిన ఓ వీడియో క్లిపింగ్‌ను అతడు తమకు ఇచ్చాడని నాయకులు తెలిపారు. భవిష్యత్‌లో ఇంలాంటి సంఘటనలు జరగకుండా కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
28న బీసీ విద్యార్థుల మహాగర్జన: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మొత్తం చెల్లించాలని, పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని, ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను రూ. రెండు వేలకు పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న బీసీ విద్యార్థుల మహాగర్జనను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలి పారు. విద్యా సంవత్సరం మొదలై ఆరునెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ‘ఫాస్ట్’ కమిటీని వేసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదన్నారు.