పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు | 25 injured as Bus overturns | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

Nov 22 2015 10:11 AM | Updated on Sep 3 2017 12:51 PM

పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి.

జమ్మలమడుగు : పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు సమీపంలోని ఎత్తులేటికట్ట వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెద్దమొడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి పెళ్లికూతురు తరఫువారు సుమారు 60 మంది బస్సులో పులివెందులకు బయల్దేరారు.

ఈ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఎత్తులేటికట్ట వద్ద బోల్తా పడింది. 25 మందికి గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెళ్లి కుమార్తెతో ఉన్న బస్సు గంట ముందే బయల్దేరి వెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement