విశాఖ జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని నిండుగుండ జంక్షన్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్నం : విశాఖ జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని నిండుగుండ జంక్షన్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.27 లక్షలు విలువచేసే 25 బస్తాల గంజాయిని, ఒక వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమతపు కోటేశ్వరరావు అనే నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గంజాయిని బీబీపట్నం, రత్నంపేటల నుంచి తునికి తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(రోలుగుంట)