2014లో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు: జానారెడ్డి | 2014 General Elections held at seemandhra and telangana states, says Minister K.Janareddy | Sakshi
Sakshi News home page

2014లో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు: జానారెడ్డి

Aug 25 2013 1:53 PM | Updated on Sep 1 2017 10:07 PM

2014లో సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి అన్నారు.

2014లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరి మండలం అనంతారంలో ఓ ప్రైవేట్ కంపెనీని మంత్రులు జానారెడ్డి, ఉత్తమకుమార్రెడ్డిలు ప్రారంభించారు.

అనంతరం జానారెడ్డి ప్రసంగిస్తూ... రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఏర్పాటు చేస్తున్న కమిటీలతో రాష్ట్ర విభజనకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సర్పంచ్లకు ప్రత్యేకంగా చెక్పవర్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామని జానారెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement