భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత | Former Bhuvanagiri MLA Kommidi Narasimha Reddy in Critical Condition | Sakshi
Sakshi News home page

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత

Jun 5 2026 10:00 PM | Updated on Jun 5 2026 10:00 PM

Former Bhuvanagiri MLA Kommidi Narasimha Reddy in Critical Condition

సాక్షి,భువనగిరి: అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే  కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా గత 20 రోజుల నుండి నిమ్స్ దవాఖానలో డైరెక్టర్ డా.బీరప్ప పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. 

నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డిని పరామర్శించి నిమ్స్ డాక్టర్లతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించారు. కొమ్మిడి నర్సింహారెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జానారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుండి రెండు దఫాలుగా 1978లో, 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement